Sunday, 5 July 2020

తాటకని రాముడు ఎందుకు హత్య చేశాడు?

కాల్పనికత, చరిత్ర  సమ్మేళనంగా  రూపొందిన  పురాగాథ పునర్విశ్లేషణ, పున:సృజన ఈ కాలపు లక్షణం. మూలాల్లోకి వెళుతున్న కొద్దీ అసలు వాస్తవాలు తెలుస్తుంటాయి. క్లాసిక్స్‌గా ప్రసిద్ధి చెందిన భారత రామాయాణాల్లోని కొన్ని పాత్రల వైశిష్ట్యం కొత్త అర్థాలతో బోధపడుతుంది. ఈ నేపథ్యంలోనే రామాయణం లోని ‘తాటక’  వృత్తాంతాన్ని బెజ్జారపు రవీందర్‌ ఒక నవలగా సృజించారు. తాటకని చంపడం రాముడు చేసిన మొదటి హత్య. తమ వనాల్లో తమదైన రీతిన బతుకుతున్న అటవిక జాతుల హననానికి మునులు ఎందుకు పాల్పడ్డారు? దీనికి సంబంధించిన పూర్వాపరాల్ని సంయమనం తో, కడు ఆసక్తికరంగా రాయడం రవీందర్‌ కథన కౌశలంలోని ప్రత్యేకత. నాగరికత పేరిట అటవీ ప్రాంతాల్లోకి చొచ్చుకు వస్తూ, అంతులేని మానవ హననానికి పాల్పడిన ఆర్యుల అసలు స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్టు దర్శింపజేస్తుందీ నవల. లోకాయతవాదం, సురులు, అసురుల గురించిన చర్చకు మరో సృజనాత్మక చేర్పు ఈ నవల. తాటక ఒక ఆదివాసీ మహిళ. ఆమెను రాముడు ఎందుకు చంపాడు? అలా చంపడానికి గల కారణాలేమిటి? నిరాయుధురాలయిన తాటకను హతమార్చడం వెనుక ఉన్న మర్మం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగల  రచనా సంవిధానం, కథన కౌశలం బెజ్జారపు రవీందర్‌ లో ఉన్నాయి. ఆరంభిస్తే చదివించుకుపోయే సారళ్యం గల ఈ నవల చదవడం మరచిపోలేని అనుభవం. ఇటీవలనే ఈ నవల కన్నడంలోకి అనువాదమైంది.  తెలుగులో నవలలు ఇష్టపడేవారు చదవదగ్గ పుస్తకమిది. 

No comments:

Post a Comment

తాటకని రాముడు ఎందుకు హత్య చేశాడు?

కాల్పనికత, చరిత్ర  సమ్మేళనంగా  రూపొందిన  పురాగాథ పునర్విశ్లేషణ, పున:సృజన ఈ కాలపు లక్షణం. మూలాల్లోకి వెళుతున్న కొద్దీ అసలు వాస్తవాలు తెలుస్త...